భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవలే తెలుగులో అలనాటి నటి సావిత్రి బయోపిక్ మహానటి విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అనేకమందిచే ప్రశంసించబడింది. ఆమె కనబరిచిన నటనకు అవార్డులు క్యూ కడతాయని సినీ అభిమానులు అంటున్నారు. అలాగే సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “ది డర్టీ పిక్చర్” మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రానికి కాను విద్యాబాలన్ జాతీయ అవార్డు అందుకున్నారు.ప్రస్తుతం తమిళంలో ఎం జీ ఆర్ జీవితకధ ఆధారంగా సినిమా నిర్మాణంలో ఉంది,జయలలిత బయోపిక్ కూడా తీయనున్నారని సమాచారం.
అయితే ఇప్పుదు తెలుగులో మరో నటి బయోపిక్ తీయనున్నారని తెలుస్తోంది.ఆమె ఎవరో కాదు తెలుగు,తమిళ,కన్నడ భాషలలో నటించిన అందాల నటి సౌందర్య. ఈమె మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ,కన్నడం,మలయాళం బాషలలో నిర్మించనున్నారట.మరి సౌందర్య పాత్ర లో ఎవరు నటిస్తారనేది చూడాలి.