బీజేపీ పదే పదే తప్పులు చేస్తోందని కర్ణాటక ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబు విమర్శిస్తున్న విషయం తెలిసినదే.అందుకు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పందిస్తూ కర్ణాటక ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు లేదన్నారు.బాబు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని భావిస్తున్నారని,అందుకనే ఉద్యోగ సంఘాల నేతలను కర్ణాటక పంపారన్నారు.
అప్పట్లో ప్రజలు ఎన్టీఆర్ కు పట్టం కడితే,చంద్రబాబు పార్టీని,ప్రజలని చీల్చారన్నారు.ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టకుండా నరేంద్ర మోదీ ని విమర్శించడం సరికాదన్నారు.