బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత కథను ఆధారంగా తీసుకొని సినిమా వస్తున్న తెలిసిందే.ఈ చిత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసినదే.ముందు ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తారని ప్రకటించనా కొన్ని కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం జరిగింది.ఇప్పుడు ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారని తెలియాల్సివుంది.

బయోపిక్ ప్రకటించినప్పటినుంచి అందులో చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రలో యంగ్ హీరో రానా పోషిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మే 28 న ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments