జనసేన అధినేత విశాఖపట్నంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలు నెరవేర్చకపోవడం,ప్రత్యేకహోదా ఇతర సమస్యలకు పోరాటానికి సిద్ధమయ్యామన్నారు.ఈ నెల 20 నుండి పోరాటాల పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తీరప్రాంతంలో గంగపూజ చేసి పోరాట యాత్ర మొదలుపెడతామన్నారు.మొదట విడతగా మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పోరుబాట ఉండనున్నట్లు ప్రకటించారు.
పవన్ మాట్లాడుతూ ప్రత్యేకహదా అంశంపైనా జనసేన మొదటినుండి ఒకే మాట మీద ఉందన్నారు.కాకినాడ,అనంతపురం సభలలో తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పామన్నారు.రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాలో వెనకబాటుదనం కేవలం ప్రజాలకేనని నాయకులకు మాత్రం కాదన్నారు.ఉత్తరాంధ్రలో ఇంకా వలసలు కొనసాగడం బాధాకరమని,ఇది ఇలాగే ఉంటే మరో రాష్ట్రం విడిపోయే అవకాశం ఉందని,వైషమ్యాలు పెరగకుండా మనమే జాగ్రత్త పడాలి అన్నారు.
ఇది కేవలం బస్సు యాత్ర మాత్రమే కాదని,పాదయాత్ర కూడా ఉంటుందని,సమస్య ఉన్న ప్రదేశానికి ఎలా వెళ్లాల్సి ఉంటుందో అలా వెళతానని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలతోపాటు,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు,ఆయా జిల్లాలోని సమస్యలమీద పవన్ తమ పోరాటం ఉంటుందన్నారు.ముఖ్యంగా ప్రత్యేకహోదా సాధనకోసం అన్ని నియోజకవర్గాలలో విద్యార్థులు,యువతతో కవాతు నిర్వహిస్తామని,జిల్లా కేంద్రాలలో లక్షమందితో కవాతు జరుపుతామన్నారు.జనసేన కూడా ఇంకా నేర్చుకోవలసి ఉందని,సమస్యలు తెలుసుకోవడం,అధ్యయనం చేయడమే కాదు,ఆ సుమస్యలకు పరిష్కారం ఎలా అన్నే విషయంపై కృషి చేస్తామన్నారు.