కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.తనకు ఈ విషయం ముందే తెలుసునని,నెల రోజుకు క్రితమే కొంత మంది అధికారులతో కలిసినప్పుడు ఈ విషయంపై చర్చ వచ్చిందన్నారు. బీజేపీకి 90 సీట్లు వచ్చినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని,వాళ్ళకి వాళ్ళ విధానాలు ఉన్నాయని,అది అందరికీ తెలిసినదేనని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడం అన్ని పార్టీలు అనుసరిస్తాయని,అన్ని పార్టీలలోనూ లోపాలు ఉన్నాయన్నారు.దశాబ్దాల కాలం నుండి ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తున్నారని,దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరూ లేరన్నారు. ఒక బీజేపీ మాత్రమే కాదు టీడీపీ,వైసీపీ కూడా ఎమ్మెల్యేలను కొంటాయన్నారు.ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని కొరికునే వారిలో తాను ఒకడినని తెలిపారు.