బిగ్ బాస్ కు నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

0
354

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగులో ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ కు రెడి అయ్యింది. అయితే ఈ సారి వ్యాఖ్యాతగా న్యాచురల్ స్టార్ నాని ఉండనున్నారు. జూన్ 10 వ తారీఖున మొదలవనున్న ఈ కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగనుంది. మొదటి సీసన్ లో 70 రోజులు మాత్రమే జరిగింది,అయితే ఆదరణ బాగా ఉండడంతో నిదివిని 100 రోజులకు పెంచారు. ఈ కార్యక్రమం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు.

అయితే నాని ఈ కార్యక్రమానికి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పై వార్తలు వస్తున్నాయి. సుమారు 4 కోట్ల రూపాయలు నానికి రెమ్యూనరేషన్ గా ఇవ్వనున్నట్టు సమాచారం. నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ముల్టీస్టారర్ చిత్రం లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here