బాబు,కేసీఆర్ లకు కుమారస్వామి విజ్ఞప్తి…

0
533

జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి పోరాడుతామని ఆయన తెలిపారు. బీజేపీయేతర నేతలు తమ పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు కేసీఆర్, చంద్రబాబు సహకరించాలని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. తమ ఎమ్మెల్యేలను ఈడీ సాయంతో బెదిరించాలని చూస్తోందని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని బట్టి కర్ణాటక ఎన్నికల ఫలితాలు అక్కడే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చినట్లైంది.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటకకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ను కుమారస్వామి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అధికారం చేజిక్కని పక్షంలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చకు లేవనెత్తి బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టాలనే యోచనలో జేడీఎస్ ఉన్నట్లు సమాచారం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here