కర్ణాటక లో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయ్.ఇప్పటికే కుమారస్వామి తమ ఎంఎల్ఏ లను రాజభవన్ కు తీసుకువెళ్ళగా కేవలం కాంగ్రెస్ నుండి 10 మందిని,జేడీఎస్ నుండి 10 మందిని మాత్రమే గవర్నర్ అనుమతించారు. తమకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని తమకు స్పష్టమైన మెజారిటీ ఉందని గవర్నర్ కు వివరించామని కుమార స్వామి తెలిపారు. దాని తరువాత ఎడ్యూరప్ప కలవడం జరిగినది. దాని తరువాత బీజేపీ నే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బీజేపీ కర్ణాటక విభాగం చేసిన ఒక ట్వీట్ సంచలనాత్మకం అయ్యింది. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు మే 17 ఉదయం ఎడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని,కర్నాటక ను ప్రగతి పధం లోకి తీసుకు వెళ్తామని దీని సారాంశం. అయితే ఇప్పటివరకు గవర్నర్ నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇది చర్చనీయామ్సమైంది. దీంతో మళ్ళీ పార్టీ ఆ ట్వీట్ ను తొలగించింది.