కర్ణాటక ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నుండి ఇట్లా లెక్కింపు వరకు రసవత్తరంగా జరిగాయి.విమర్శలు,ప్రతి విమర్శలతో నాయకులు ప్రచారాలలో హోరెత్తించారు.చివరకు మే 15 న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.మొత్తం 222 స్థానాలకు పోటీ చేయగా అందులో బీజేపీ 104,కాంగ్రెస్ 78,జే డీఎస్ 39 స్థానాలను గెలుచుజున్నాయి.కానీ బీజేపీ కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా లేకపోవడంతో కాంగ్రెస్,జేడీఎస్ ఏకమై గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలని కోరారు.తమది పెద్ద పార్టీ కనుక తమకే అవకాశమివ్వాలని యడ్యూరప్ప గవర్నర్ ని కోరారు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం గవర్నర్ అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ఆహ్వానిస్తారని,రేపు మధ్యాహ్నం 12గం 20 నిమిషాలకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా రాజభవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ ఇదే జరిగితే తాము న్యాయ పోరాటానికి దిగుతామని అంటున్నారు.