క్రికెట్ ప్లేయర్ శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని జీవిత కాలం నిషేధం విధించిన విషయం తెలిసినదే. అయితే నిన్న శ్రీశాంత్ కు సుప్రీమ్ కోర్టు ద్వారా చుక్కెదురు అయ్యింది. ఇంగ్లీష్ కౌంటీ లో ఆడేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వేసిన పిటీషన్ ను సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది. ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్తోపాటు మరి కొందరిని నిర్దోషులుగా తేల్చిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై జూలైలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. మళ్లీ క్రికెట్ ఆడడానికి శ్రీశాంత్ ఎంత ఆత్రుతతో ఉన్నాడో తాము అర్థం చేసుకోగలమని.. కానీ హైకోర్టు ఆదేశాలు వెలువడేంత వరకు ఎదురు చూడాల్సిందేనని చీఫ్ జస్టిస్ దీపక్ మిత్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Subscribe
Login
0 Comments