దేశం గర్వించదగ్గ గానగంధర్వులు ఇద్దరే ఇద్దరు వారే ఏసుదాస్ మరియు ఎస్ పీ బాలసుబ్రమణ్యం. ఇద్దరు 5 దశాబ్దాలుగా పాటలు పాడుతూ అందరిని మైమరిపిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎస్ పీ బాలసుబ్రమణ్యం ఏసుదాస్ గారి గురుంచి మాట్లాడుతూ ఆయన తనకు గురువులాంటి వారని,తొలినాళ్ళలో ఆయనను చూసి భయపడేవాడినని అన్నారు. మళయాళ ప్రజలు ఏసుదాస్ గారిని దేవుడిలా భావిస్తుంటారని,అందువలన ఆయనతో కలిసి ఎలా పాడాలా అని దూరంగా ఉండేవాడినన్నారు. ఒక 20 సంవత్సరాలుగా ఆయన కలిసి ఎక్కువ కార్యక్రమాలలో పాల్గొనడం వాళ్ళ బాగా దగ్గరయ్యే అవకాశం వచ్చిందని,వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అనే ప్రస్తావన ఎప్పుడూ రాలేదన్నారు.
Subscribe
Login
0 Comments