జై లవకుశ విజయం తరువాత కొంత సమయం విశ్రాంతి తీసుకొని త్రివిక్రమ్ దర్సకత్వంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే మొదటి షెద్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది.రెండో షెద్యూల్ లో కుటుంబ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వస్తున్న సమాచారం ప్రకారం ఇందులో ఒక పాత్రకి సీనియర్ హీరోయిన్ రంబ నటించానున్నారట. త్రివిక్రమ్ సినిమాలలో సీనియర్ హీరోయిన్స్ కు ఒక మంచి క్యారెక్టర్ ఉంటోంది.  అత్తారింటికి దారేదిలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అజ్ఞాతవాసిలో ఖుష్బూలు కీలక పాత్రల్లో మెప్పించారు. త్వరలోనే రంభ,ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో తారక్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments