తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం సంచలనంగా మారింది.వయోపరిమితి పేరుతో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సహా ఇతర అర్చకులు విధులనుంది తొలగించారు.ఈ విషయమై రమణ దీక్షితులు స్పందిస్తూ అర్చక వ్యవస్థలో వేలు పెట్టే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదన్నారు.తాను విమర్శలు చేసినందుకు ప్రతీకార చర్య గానే ఈ వయోపరిమితి నిర్ణయం తీసుకుందని విమర్శించారు.టీటీడీ ని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని సవాల్ చేశారు.హిందు ధర్మం లో జోక్యం చేసుకుంటున్న ప్రభుత్వానికి ఇతర మతాలలో జోక్యం చేసుకునే దమ్ముందా…? అని ప్రశ్నించారు. శ్రీవారికి నైవేద్యం కూడా పెట్టడం లేదని,ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారని,భక్తులను నిజాలేమిటో తెలియడానికే తాను మీడియా ముందుకు వచ్చానన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments