కింగ్ అక్కినేని నాగార్జున,వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఆఫీసర్. చాలా కాలం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండడంతో ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా మే 25 న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు వర్మ.అయితే సాంకేతిక కారణాల వాళ్ళ ఆఫీసర్ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. క్వాలిటీ పరంగా సినిమాను అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు ముందుగా అనుకున్న సమయంకన్నా ఎక్కువ సమయం పడుతోంది. అందుకే నాగార్జున ఆఫీసర్ ను మే 25 కాకుండా జూన్ 1 న విడుదల చేయాలని నిర్ణయించాం అని తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments