వి.వి.వినాయక్,నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చెన్నకేశవరెడ్డి’ చిత్రం తర్వాత రిపీట్ కాబోతున్న ఈ కాంబినేషన్‌లో మూవీని నిర్మాత సి. కల్యాణ్ తన సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ముఫ్తీ’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వెలువడింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments