ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత,వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదం పై దిగ్బ్రాంతి చెందారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇది మూడో పడవ ప్రమాదమని,లైసెన్స్ లేని బొట్లు ఎలా తిరుగుతున్నాయని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై హత్యా కేసు పెట్టాలని,పాలన లోపం వాళ్ళ జరిగిన ఈ ఘటనలు అన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రమాదం లో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని,రాస్త్రంలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాకూడా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి టీడీపీ నేతల వరకూ అందరూ లంచాలు తీసుకోవడం వల్లే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments