గత కొంత కాలంగా బీజేపీ పై విమర్శలు,ఆరోపణలు చేస్తున్న ప్రముఖ హీరో శివజీపై బీజేపీ శ్రేణులు దాడికి యత్నించారు.ఈయన బీజేపీ దక్షిణభారతం కైవసం చేసుకోవడానికి ఆపరేషన్ ద్రవిడ పేరుతో పన్నాగం పన్నిందని దానికోసం ఎవరికి ఇవ్వవలసిన ముడుపులు అందాయని,ఎలా ప్రణాళిక ఉంటుందో సోషల్ మీడియా ద్వారా చెప్పారు,అలాగే కర్ణాటక లో బీజేపీ తధ్యమని,నరేంద్ర మోదీ పై అనేక ఆరోపణలు చేశారు.
సోమవారం బీజేపీ శ్రేణులు కన్నా లక్ష్మినారాయణకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు,అదే సమయంలో శివాజీ హైదరబాద్ నుండి గన్నవరం చేరుకున్నారు.అది గమనించిన బీజేపీ శ్రేణులు నరేంద్ర మోదీ ని టీడతావా అంటూ దుర్భాశలాడారు,అది పెద్ద వాగ్వాదానికి దారి తీసింది.దీనితో పోలీసులు కలగచేసుకొని శివాజీని కార్ ఎక్కించి పంపించారు.