తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఏర్పడ్డాక తొలి సమావేశంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది.65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు పదవీ విరమణ కల్పించాలని బోర్డ్ నిర్ణయించింది.దీనితో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు,శ్రీనివాసమూర్తి దీక్షితులు,నారాయణదీక్షితులు పై వేటు పడింది.అయితే ఈ నిర్ణయం పై అర్చకులు మండిపడుతున్నారు.
నిన్న చెన్నైలో జరిగిన విలేఖరుల సమావేశంలో రమణ దీక్షితులు టీటీడీ అర్చక వ్యవస్థ లో జరుగుతున్న అవకతవకలపై,రాజకీయ ప్రభావం పై విమర్శలు చేసి తన అసంతృప్తి ని వెళ్లబుచ్చారు. అది జరిగిన 24 గంటలలోగా వేటు పడడం గమనార్హం.అయితే వేటుకు వయసు సాకు చూపెడుతూ నిన్న రమణ దీక్షితులు మాట్లాడిన దానిపై వివరణ కొరతామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అనడం అందరిని ఆలోచింపజేసేలా చేసింది.