విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో సంఘీభావం యాత్ర జరుగుతోంది.ఈ యాత్ర లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై విమర్శలు చేసారు.ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిన చంద్రబాబు తన వైఫల్యాలను ఇతర పార్టీలపై రుద్దుతున్నారన్నారు. ప్యాకేజకిీ ఆశపడి ప్రత్యేకహోదాని చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు.బీజేపీ,వైసీపీ లాలూచీ పడ్డారని విష ప్రచారం చేయడం సరికాదని,స్వయానా బీజేపీ అధికార ప్రతినిధే తమతో వైసీపీ కలవలేదని చెప్పారని స్పష్టం చేశారు.తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని,ప్రత్యేకహోదా ఎవరిస్తే వారికి మద్దతు ప్రకటిస్తామన్నారు.