అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల మహానటి సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యువ కథానాయకుడు టాక్సీవాలా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స​ 2 బ్యానర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకుడు.ఈ సినిమాను మే 18న రిలీజ​ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోటంతో టాక్సీవాలా రిలీజ్‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో విజయ్‌ దేవరకొండ తన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ‘మై రౌడీస్‌.. నేను మే 18న రావట్లే. భయపడటానికి, అరవటానికి, గట్టిగా నవ్వడానికి కాస్త వెయిట​ చేయండి. కొత్త రిలీజ్‌ డేట్‌ను మరో వారం​ రోజుల్లో వెల్లడిస్తాం’ అంటూ ట్వీట్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments