నిర్మాత దిల్ రాజు .. దర్శకుడు సతీశ్ వేగేశ్న కలిసి గతంలో చేసిన ‘శతమానం భవతి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో ‘శ్రీనివాస కల్యాణం’ రూపొందుతోంది. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా నందిత శ్వేత కనిపించనుంది.టైటిల్ ను బట్టే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకున్నారు. అయితే దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘లవర్స్’ను .. జూలైలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందువలన ‘శ్రీనివాస కల్యాణం’ను ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments