చంద్రబాబుపై పవన్‌ ఆగ్రహం

0
305

చిత్తూరులోని హై రోడ్ వెల్పేర్‌ ఆప్షన్‌ బాధితుల పక్షాన అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆయన మంగళవారం బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని ప్రజలకు న్యాయం చేయలేదు కానీ మిగిలిన జిల్లా ప్రజలను ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పేద ప్రజలకు న్యాయం చేయాలని.. డబ్బున్న వ్యక్తికి ఓ న్యాయం.. పేదోడికి ఓ న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అని ప్రశ్నించారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఆయన బాధితులతో కలసి దుర్గానగర్ నుంచి గాంధీ రోడ్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యాకర్తలు తరలివచ్చారు.

శ్రీకాళహస్తిలో పూజలు
అంతకుముందు తిరుమలలో రెండు రోజులు బస చేసిన పవన్ కళ్యాణ్‌ ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరుడి దర్శించుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన ప్రసున్నాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్‌కు తీర్ధప్రసాదాలు అందజేశారు.

పవన్ రాకతో అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కాబోయే సీఎం అంటూ ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఆలయ ముఖద్వారం మూసివేసేందుకు ప్రయత్నించటంపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. అనంతరం పవన్‌ గుడిమల్లం పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here