కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అధ్యతిక ఓట్లు సాదించి విజయం సాదించిన విషయం తెలిసినదే. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా కాంగ్రెస్,జేడీఎస్ కలిసి ఏర్పాటు చేస్తాయా చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఢిల్లీ లో బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం అసాదారణమని,ఈ విజయానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్రాల్లో భాష ఏదైనా మనమంతా ఒక్కటేనన్న విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయని, ఉత్తరాది పార్టీ అని బీజేపీపై ఉన్న ముద్రను చెరిపివేశాయని, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బీజేపీ చేరువైందని అన్నారు. ఎన్నికలు, స్వప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. దక్షిణ, ఉత్తర భారతదేశాలంటూ కాంగ్రెస్ పార్టీ విభజించి మాట్లాడుతోందని, విభజించు-పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని, విభజన రాజకీయాల వల్ల దేశానికి నష్టమని అన్నారు. పదేపదే అబద్ధాలు చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పిన మోదీ, యావత్ భారదేశం అభివృద్ధి చెందేందుకు బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు