మహానటి సినిమా విజయవంతం అవ్వడంతో మంచి హుషారుగా ఉన్నారు కీర్తి. ఆమె మహానటి సావిత్రి గారి పాత్రలో బాగా ఒడిగిపోవడం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె దివంగత పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ లో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.అలాగే రాంచరణ్,జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి తీయబోయే ముల్టిస్టారర్ లో కీర్తి ఒక హీరోయిన్ గా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కీర్తి సురేష్ మహానటి సినిమా విజయవంతం అవ్వడంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా కీర్తి విలేఖరులతో మాట్లాడుతూ తనకు ఎప్పటినుంచో స్వామివారిని దర్శించుకోవాలనుందని,కానీ షూటింగ్ ఉండడం వల్ల ఇంత సమయం పట్టిందన్నారు. జయలలిత బయోపిక్ గురుంచి అడగగా తాను జయలలిత బయోపిక్ లో నటించడం లేదన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments