జనసేన పార్టీ ఒక పాటను రూపొందించింది. ఈ పాటను ప్రముఖ పాటల రచయత అనంత శ్రీరాం రాయగా ప్రముఖ సంగీత దర్శకులు అనూపు రూబెన్స్ స్వరాలను సమకూర్చారు. ఈ పాట వింటే మొత్తం విప్లవాత్మక ధోరణిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులోని సాహిత్యం అందరినీ ఆలోచింపజేసేలా,జనసేన సిద్ధాంతాలను స్పష్టంగా తెలుపుతున్నాయి. గండర గండర గండర గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా అంటూ మొదలవుతుంది. ఈ పాట ద్వారా తెలుగువారి ఆత్మగౌరావాన్ని కాపాడుతుందని,అణచ బడిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనకు ఎటువంటి మత,కుల,జాతి విపక్ష ఉండదని,తాను ఎప్పుడు ఒక సగటు దేశభక్తి కలిగిన భారతీయుడినేనని చాలా సందర్భాలలో చెప్పారు. ఇదే సూత్రం తో తాను పార్టీ పెట్టానని తెలిపారు. ఈ పాట మొదటి చరణంలో వీటి గురుంచి ప్రస్తావించారు. కులాలను కలుపుకుపోవడం,మతాల గురుంచి ప్రస్తావించకపోవడం,ప్రతి భాష,సంస్కృతిని గౌరవించడం,ప్రాంతాలను గౌరవించు జాతీయ వాదం,ప్రకృతినెపుదు ప్రేమించే ప్రగతి నినాదం,అవినీతితో ఎల్లపుడూ అలుపెరుగని యుద్ధం చేయడం వంటి జనసేన 7 సిద్ధాంతాలను సామాన్యునికి చేరేలా సాహిత్యం ఉంది.
ఇక రెండో చరణానికి వస్తే జనసేన జెండా సగటు కి మనోధైర్యం కలిగిస్తుందని,అంబేద్కర్ పూలే వంటి వారి ఆశయాలు నేరవేర్చతంలో ముందుంటుందని,అణగారిన వర్గాల ప్రజలకు ఎప్పుడు తోడుగా వారి ఆశలను నేరవేర్చే దిశగా జనసేన అడుగులు వేస్తుందని,దేశ ప్రజల శ్రేయస్సు కోసం పరితపించిన భగత్ సింగ్,ఝాన్సీ లక్ష్మీభాయ్,ఆజాద్,సుభాష్ చంద్రబోస్ వంటి వారి స్పూర్తితో ప్రజల శ్రేయస్సు ఎక్కడా వెనకాడకుండా జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసారు. చివరి కొసమెరుపుగా భరతమాత మెడలో ఇదే మెరిసే దండ అంటే ఎల్లప్పుడూ జనసేన దేశ శ్రేయ్యస్సుపై పాటుపడుతూ ఉంటుందని తెలియజేసారు.
పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపడుతున్న ఈ సమయంలో కార్యకర్తలను ఉత్తేజపరిచడానికి, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను పజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఈ పాట దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.