ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరు నియోజికవర్గం వెంకటాపురంలో పైలాన్ ఆవిష్కరించారు.కాగా, రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకొస్తానని, అందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే తన సంకల్పమని జగన్ ఓ ట్వీట్ చేశారు.. 2004, మే 14న ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని, అదే తేదీన రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశానని అన్నారు. వైఎస్ ముందుచూపు, ఆయన చేపట్టిన అభివృద్ధి పథకాలు నిరుపమానమని ప్రశంసించారు.
Subscribe
Login
0 Comments