అంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసినదే. సోమవారం ఆయన ఏలూరు నియోజికవర్గంలోకి అడుగుపెట్టి 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో పైలాన్ ఆవిష్కరించారు.అనంతరం ఏలూరు పాత బస్స్టాండ్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఉత్తమ విల్లన్ అవార్డు ఇవ్వాలని,పశ్చిమగోదావరి జిల్లాలో ఎంఎల్ఏలు ఇసుకను,మట్టిని,గోదావారి తల్లిని కూడా వదలలేదని,ఇప్పటివరకు రూ.400 కోట్ల ఇసుకను కొల్లగోట్టారని,అయినా చంద్రబాబు నోరు మెదపలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న తహసీల్దారు వనజాక్షిని దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని జుట్టు పట్టుకున్నారని,చింతమనేని పై చర్య తీసుకోవలసిన చంద్రబాబు ఆ వ్యవహారం పై పంచాయితి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతి మాయం అయ్యిందని,అధికారుల దగ్గర నుండి చినబాబు లోకేష్ వరకు లంచాలు చేరుతున్నాయని,అక్కడి నుంచి పెదబాబు చంద్రబాబుకు చేరుతున్నాయన్నారు.ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారన్నారు.వైసీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేదని పేర్కొన్నారు.హోదా కోసం నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నది ఒక్క వైసీపీయేనని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అంతా అవినీతిమయంగా మారిందని, అవినీతిపరులైన ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘‘చంద్రబాబు ఎన్ని డ్రామాలైనా ఆడగలరు. ఈ పెద్ద మనిషికి అవార్డు ఇవ్వాల్సి వస్తే ఉత్తమ విలన్‌ అవార్డు ఇవ్వాలి’’ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments