గంభీర్ ను అధిగమించిన కోహ్లీ

0
268

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ… ఐపీఎల్ లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ను మూడో స్థానానికి నెట్టేశాడు.ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 3,683 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 3,525 పరుగులు, గంభీర్ 3,518 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లు ఉన్నారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఈ ఘనతను సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here