కాంగ్రెస్‌ పార్టీపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విరుచుకుపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద రైతులకు ఇచ్చే రూ.12 వేల కోట్లు ఎన్నికల స్టంట్‌ అని కాంగ్రెస్‌ మాట్లాడుతోంది. ఆ మాటలు అనడానికి సిగ్గు ఉండాలి.. అలాంటి వాళ్లను చూసి తెలంగాణ సిగ్గు పడుతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మూడేళ్లు రైతు రుణమాఫీ జమ చేశాం.. దీనినై ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమాధానం చెప్పగలవా..?

40 ఏళ్ల మీ పాలనలో 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చారా..? రాబోయే కాలంలో ఉచిత కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పచ్చ కామెర్లు వారికి లోకమంతా పచ్చగానే కనపడుతున్నట్టు ఉంది కాంగ్రెస్‌ పరిస్థితి. చిల్లర, మల్లర రాజికీయాలు ఉత్తమ్‌ మానుకోవాలి.  కాంగ్రెస్‌ ప్రజల సమస్యలను, కన్నీళ్లను పట్టించుకోనేలేదు.. కాంగ్రెస్‌ పార్టీ ఓ డ్రామా కంపెనీ.. ప్రజలు వారిని నమ్మరు.’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments