ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి,పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.అనంతరం రంగసాగరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడని కన్నా సర్టిఫికెట్ ఇచ్చారని, వైసీపీకి వెళ్ళటానికి సిద్ధమైన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని సీఎం అన్నారు.పెన్షన్ల పంపిణీలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని 50 లక్షల మందికి పెన్షన్ ఇచ్చి పెద్దకొడుకునయ్యానన్నారు.ఐదు బడ్జెట్లలో తెలుగు ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంపై తన కంటే బాగా చేస్తే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.
Subscribe
Login
0 Comments