కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతున్నాయి. ఎవరి మద్దతు లేకుండానే, ఒంటరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వస్తున్నాయి. ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, కర్ణాటక ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఆనందకరమని చెప్పారు. యావత్ దేశం నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటోందని… అందుకే ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోందని అన్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాదులో విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నామని… ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments