డైలాగ్‌ కింగ్‌, బహుభాష నటుడు సాయికుమార్‌ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి చిత్తుగా ఓడిపోయారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ డైలాగ్‌ కింగ్‌కు తెలుగు సెంటిమెంట్‌ కలిసిరాలేదు. ఈ సారి సైతం అతను ఓటమి పాలయ్యాడు.కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విజయానికి చేరువగా ఉండగా.. సీపీఎం, జేడీఎస్‌ అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారు. రాష్ట్రమంతా బీజేపీ హవా కొనసాగుతున్నా సాయికుమార్‌ మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నాడు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయికుమార్‌ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments