కర్ణాటక ఎన్నికల లెక్కింపు చివరి దశకు చేరుకుంది.ఇప్పుడు కర్ణాటక లో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా ఉన్నాయి.మొత్తం 222 సీట్లకు ఎన్నికలు జరగగా బీజేపీ కి 107,కాంగ్రెస్ కి 77,జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకున్నాయి.ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉన్న శాసనసభ స్థానాలలో కనీసం సగం అంటే 112 సీట్లు కావాలి.ఇప్పుడు కచ్చితంగా జీడీఎస్ మద్దతు తీసుకోవలసిన పరిస్థితి. అటువైపు కాంగ్రెస్,జేడీఎస్ మద్దతు కోరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.కుమారస్వామికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా కాంగ్రెస్ ఇచ్చిందనేది సమాచారం.ఒకవేళ కాంగ్రెస్,జేడీఎస్ కలిసి వెళ్తే గవర్నర్ మద్దతిస్తారా,లేదా జాతీయ పార్టీ అయిన బీజేపీ ని ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆహ్వానిస్తారా వేచి చూడాలి.
Subscribe
Login
0 Comments