ట్విట్టర్ సామజిక మాధ్యమం గాలి వార్తలకు వేదికగా నిలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్విట్టర్ యూజర్లు వ్యాప్తి చేసే వార్తల్లో 86-91 శాతం తప్పుడువేనని అమెరికాలో ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో చాలా మంది యూజర్లు ఫేక్ వార్తలను రీట్వీట్ చేస్తూ లేదా లైక్ కొడుతున్నారట. ఈ అధ్యయనం వివరాలు జర్నల్ నేచురల్ హజార్డ్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. కేవలం ఐదు నుంచి తొమ్మిది శాతం మంది యూజర్లు తప్పుడు వార్తా, కాదా అని వచ్చిన వార్తను రీట్వీట్ చేసి నిర్ధారించుకుంటున్నట్టు పరిశోధకలు తమ అధ్యయనంలో భాగంగా గుర్తించారు. కేవలం 1-9 శాతం లోపు వారు వార్తల కచ్చితత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇక తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిలో పది శాతం మంది వరకు తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారట.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments