ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది . నిన్నటికి నిన్న సావిత్రి బయోపిక్ విడుదలై మంచి విజయంతో ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. ఇప్పుడు ఈ కోవలోకి ఒక పోర్న్ స్టార్ వచ్చి చేరింది,ఆమె ఎవరో కాదు సున్నీ లియోన్. ఆమె జీవిత కధను ఆధారంగా చేసుకొని తెరకెక్కనుండి. కాకపోతే ఇది వెండి తెర మీదకు కాదు,వెబ్ సిరీస్ గా రాబోతోంది. సెన్సార్ సమస్యల రీత్యా వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ముఖ్య పాత్రలో సన్నీ లియోన్ నటిస్తోంది. ఇది డైరెక్ట్ గా యూట్యూబ్ లో చూడలేమట,కొంత డబ్బు చెల్లించి మాత్రమే చూడాలట. లేటెస్ట్ గా ఈ బయోపిక్ టీసర్ ను కూడా విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ కు “కరణ్ జీత్ కుర్ డి అన్టోల్డ్ స్టొరీ అఫ్ సన్నీ లియోన్” అనే టైటిల్ పెట్టారు. సన్నీకి చిన్నతనంలో ఎదురైనా అనుభవాలు, సన్ని పోర్న్ ఇండస్ట్రీలోకి ఎందుకు అడుగు పెట్టాల్సొచ్చింది, పోర్న్ స్టార్ గా ఎలా అయింది, అక్కడ నుండి బాలీవుడ్ లోకి ఎందుకు ఎంటర్ అయింది అన్న విషయాలన్నీ ఇందులో స్పష్టంగా చూపించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments