సినీ నటి,దర్శకురాలు జీవిత రాజశేఖర్, హేతువాది బాబు గోగినేని తో సహా పలువురు సినీ నటులు,పవన్ కళ్యాణ్ ఫాన్స్,సోషల్ మీడియా పై మొత్తం 28 మంది మీద నటి శ్రీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం హుమయూన్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికీ తనపై వాట్సాప్, ఫేస్బుక్లో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఏసీపీని కోరారు. ఫిర్యాదులోని అంశాలను సైబర్ క్రైం సహకారంతో వివరాలు సేకరించి ఆపై న్యాయ సలహాలు తీసుకుని కేసు నమోదు చేస్తామని ఏసీపీ వివరించారు.
Subscribe
Login
0 Comments