మేమిద్దరం మంచి స్నేహితులం…

0
266

మెగా పవర్ స్టార్ రామచరణ్ తేజ్ చిత్రం రంగస్థలం విడుదలై మంచి విజయం సాదించింది,దాని తరువాత 20 రోజులకు మహేష్ బాబు భరత్ అనే నేను కూడా విడుదలై మంచి విజయాన్ని సాదించింది. ఇలా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్న విషయం తెలిసినదే. కాగా మహేశ్ ఫాన్స్ మధ్య చరణ్ ఫాన్స్ మధ్య మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ విషయమై రామచరణ్ ఒక ఇంటర్వ్యూ లో స్పందించారు. తను,మహేష్ మంచి స్నేహితులమని,తమ మధ్య ఎలాంటి పోటీలేదని, ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందంటూ తాము లెక్కలేసుకోమని అన్నారు.ఆయనకు పోటీగా తన సినిమాలు విడుదల చేస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెర్రీ మండిపడ్డాడు. రంగస్థలం, భరత్‌ అనే నేను సినిమాలు ఘనవిజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. రామచరణ్ ఇప్పుడు బోయపాటి దర్సకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసినదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here