కెలకమాకు సామీ…

0
278

రామ్ గోపాల్ వర్మ,ఎప్పుడు ఎదో ఒక కాంట్రావేర్సి తో ఎప్పుడు జనాల నోళ్ళల్లో ఉండే పేరు. ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం,దానికి పవన్ ఫాన్స్ రియాక్ట్ అవ్వడం తెలిసినదే.తాజా ఇప్పుడు పవన్ పై మళ్ళీ వ్యంగాస్త్రం విసిరారు. తిరుమలకు పవన్ కళ్యాణ్ కాలినడకన వెళ్తూ మార్గమధ్యలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై వర్మ ట్వీట్‌ చేస్తూ..‘పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ ఎనర్జీకి ఇదే ఉదాహరణ’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు.

దానికి ప్రముఖ పాటల రచయత రామ జోగయ్య శాస్త్రి కౌంటర్ చేస్తూ  ‘ కెలకమాకు సామీ… కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు.. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్‌ చేసి మాట్లాడుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు. మరి రామజోగయ్య శాస్త్రి ట్విట్‌ కు వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here