మళ్లీ భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

496

పెట్రోల్, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ‍్యంగా కర్ణాటక ఎన్నికలు ముగిసిన రెండు రోజుల అనంతరం మళ్లీ భగ్గుమన్నాయి. సోమవారం లీటరుకు పెట్రోల్ ధర 17 పైసలు , డీజిల్ 21 పైసలు   పెరిగింది. దీంతో మరోసారి రికార్డు స్థాయిని తాకాయి.   దాదాపు 19 రోజుల అనంతరం  ఢిల్లీలో పెట్రోలు ధర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల గరిష్టాన్ని నమోదు చేశాయి.  అటు డీజిల్ ధర  లీటరుకు 66 రూపాయల వద్ద ఆల్‌ టైం హైని టచ్‌ చేసింది.  ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌  ప్రకారం.  ఢిల్లీలో లీటరుకు 21 పైసలు, కోలకతాలో లీటరుకు 5 పైసలు, ముంబయిలో 23 పైసలు, చెన్నైలో లీటరుకు 23 పైసలుగా ఉంది.మరోవైపు   పెట్రోల్‌ ధర లీటరుకు 17 పైసలు, కోలకతాలో 18 పైసలు, ముంబయిలో 17 పైసలు, చెన్నైలో లీటరుకు 18 పైసలు పెరింగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.   ఢిల్లీలో  పెట్రోల్‌ లీటరుకు 74.8 రూపాయలు కోలకతా 77.5 రూపాయలు,  ముంబైలో  82.65 రూపాయలు, చెన్నైలో  77.61రూపాయలుగా ఉంది.  లీటరు డీజిల్ ధర ఢిల్లీ రూ. 66.14 లీటర్, కోలకతా రూ. 68.68 ,  ముంబైలో రూ. 70.43 లీటరు, చెన్నైలో లీటరు రూ. 69.79. గా ఉంది.  ఈ ధరలు సోమవారం ఉదయం 6గంటలనుంచి అమలులోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here