జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసినదే. సోమవారం వరకు తిరుమలలో ఉండి దగ్గరలో ఉన్న దేవాలయాలను దర్శించుకొని అక్కడి భక్తుల సమస్యలు తెలుసుకుంటారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బస్సు యాత్ర ప్రారంభించే ముందు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చామని అన్నారు. ఆలయ అర్చకులు పవన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.