• తెలుగు రాష్ట్రాల్లో ‘మహానటి’ జోరు
  • ఇతర దేశాల్లోనూ అదే సందడి
  • వెల్లువెత్తుతోన్న ప్రశంసలు

సావిత్రిని అభిమానించే ప్రేక్షకులంతా ఆమె బయోపిక్ గా వచ్చిన ‘మహానటి’ సినిమాకి నీరాజనాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఇతర దేశాల్లోనూ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సావిత్రి జీవితాన్ని నిజాయితీగా తెరకెక్కించిన కారణంగా ఈ సినిమాకి నూటికి నూరు మార్కులు వేసేస్తున్నారు.దర్శకుడిగా నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని .. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. యూఎస్ఏ లో శనివారం నాటికి ఈ సినిమా 1.28 మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. ఈ సినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్పారు. ఆస్ట్రేలియా .. యూకే .. కెనడా.. న్యూజిలాండ్ ప్రాంతాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోందని ఆయన అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments