అశ్వినీదత్ సినిమాలంటే బయ్యర్లకు,దిష్ట్రిబ్యూటర్లకు చాలా నమ్మకం. సినిమా పెద్దగా ఆడకపోయినా అశ్వినీదత్ డబ్బులు తిరిగి ఇచ్చేయడమో లేదా మరుసటి చిత్రం ద్వారా న్యాయం చేయడమో చేస్తారు. పూర్తిగా బిజినెస్ కాకుండా చిత్రాన్ని విడుదల చేయరు.
ఇక మహానటి విషయానికొస్తే ఇది సావిత్రి జీవిత చరిత్ర కావడం తో విడుదలకు ముందే జీ తెలుగు,జెమినీ టీవీ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. కాని వారికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ చిత్రం విడుదలై విజయవంతం అవ్వడంతో డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఎంత రేట్ కు మహానటి అమ్ముడుపోతుందో వేచి చూడాలి.