తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. ఈ రైతుబంధు కార్యక్రమానికి చాలా మంది విరాళాలు ఇవ్వడానికి అనేకమంది ఆసక్తి చూపుతున్నారని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫోటోలతో సహా నేతిజేన్లతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా పెట్టుబడి సాయంలో తమ వంతు సహకారం అందించాలనుకునే వారి కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విరాళాలు ఇవ్వదలచిన వారు www.esevaonline.telangana.gov.in లో రైతుబంధు ఫ్లాట్‌ఫాం ద్వారా ఇవ్వవచ్చని ట్వీట్లో పేర్కొన్నారు.
Subscribe
Login
0 Comments