తిరుపతిలో అమిత్ షా పై జరిగిన దాడికి తెలుగుదేశం శ్రేణులే బాధ్యులని బీజేపీ, వైసీపీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి ఈ విషయం పై మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు . జగన్ బీజేపీ నేతలపై వాలిన ఈగలను తోలే బంట్రోతు అని,బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారన్నారు.దీని బట్టి చూస్తే బీజేపీ,వైసిపీ కుమ్మక్కయినట్టు తెలుస్తుందన్నారు. అమిత్ షా పై దాడి జరిపింది తమ పార్టీ వాళ్ళు కాదని,వై ఎస్ అనుచరుడైన కోలా ఆనంద్ అని ఆరోపించారు. జగన్ పదేపదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అడ్డుపడుతున్నారన్నారు.
జగన్ బంట్రోతులా వ్యవహరిస్తున్నారు…
Subscribe
Login
0 Comments