జనసేనాని టూర్ లో డిసైడ్ అయ్యేవి…

0
272

పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసినదే. పవన్ అలిపిరి నుండి మెట్ల మార్గం ద్వారా సామాన్య ప్రజలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. అక్కడే జనసేనాని మూడు రోజుల పాటు అక్కడే ఉండి మిగిలన క్షేత్రాలను దర్శించుకుంటారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.అయితే ఈ యాత్రలో భాగంగా పార్టీ కి సంబంధించి పవన్ కమిటీలను లేదా ఎంఎల్ఏ అభ్యర్ధులను ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా జనసేన శ్రేణులలో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఆయా నియోజికవర్గాలలో కార్యకర్తలను సమన్వయపరుస్తూ అక్కడ ఉండే స్థానిక నాయకులు సభలు,పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటనలో జిల్లా నాయకులుగా పవన్ జనాధరణ ఎక్కువగా ఉన్న ప్రాంతీయ నాయకులను కమిటి అధ్యక్షుడిగా నియమించవలసి ఉంటుంది. ఎవరికీ ఎక్కువ ఆశ కల్పించకుండా,ఒకవేళ ఆశ కల్పించినా ఆశ తీర్చవలసి ఉంటుంది,అదీ కాక మిగతా వారికి ఆ అభ్యర్ధికి ఎంపిక చేయడంలో పూర్తిగా క్లారిటీ ఇవ్వవలసి ఉంటుంది. లేకపోతే మిగతా వారికి ఆశలు పెరిగిపోయి వారిలో వారికే మనస్పర్ధలు వచ్చి పార్టీ మనుగడ కు ప్రమాదం కలిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉన్న టీడీపీ,వై సీ పీ పార్తీలలాగే గ్రూపు రాజకీయాలు మొదలైతే ఎన్నికల సమయానికి పార్టీకి పెద్ద తలనొప్పిగా అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here