అంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసినదే. ఇప్పుడు ఆయన పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు మండలంలోకి ప్రవేశించే పెదయెడ్లగాడి వంతెన మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు జగన్ కు ఘనస్వాగతం పలికారు.ఈ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర కొనసాగనుంది. కాగా, జగన్ తన పాదయాత్రలో రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాతనున్నారు.ఈరోజు ఏలూరులో పర్యటించనున్న జగన్ ఈ మైలురాయిని దాటనున్నారు. ఈ సందర్భంగా ఏలూరు మండలంలోని వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు.
Subscribe
Login
0 Comments