ఖైరతాబాద్‌లో హోర్డింగ్ ఎక్కి మాజీ హోంగార్డులు నిరసన వ్యక్తం చేశారు. విధుల నుంచి తొలగించిన తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కారణాలతో గతంలో 360 మంది హోంగార్డులను పోలీసుశాఖ విధుల నుంచి తప్పించింది. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై మూడు నెలల క్రితమే సీఎం కేసీఆర్ సంతకం చేశారని, తమ నియామకంపై డీజీపీ స్పష్టమైన హామీ ఇవ్వాలని మాజీ హోంగార్డులు కోరుతున్నారు.
Subscribe
Login
0 Comments