బీజేపీ ఎంపీ,సినీనటి హేమామని త్రుటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ మధురలో ఊ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఎంపీ కాన్వాయ్ ముందు అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కూలింది. దానిని గమనించిన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. మాంట్ తహశీల్లోని మిట్టౌలీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న హేమమాలిన ప్రసంగిస్తుండగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో వెనక్కి వెళ్లిపోవాలని ఎంపీ నిర్ణయించుకున్నారు. కాన్వాయ్ బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.