ప్రముఖ సినీ నటుడు మృతి…

0
213
మలయాళం ప్రముఖ నటుడు కళాశాల బాబు(68) ఆదివారం రాత్రి ఎర్నాకుళంలో కన్నుమూశారు. గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కళాశాల బాబు గత రాత్రి సెలెబ్రల్ హ్యామరేజ్ కారణంగా మృతి చెందారు.
ఆయన తల్లిదండ్రులు ఫేమస్ కథాకలి మాస్ట్రో కళామండలం క్రిష్ణన్ నాయర్, మోహినీ ఆట్టం డ్యాన్సర్ కల్యాణికుట్టి అమ్మ. ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బుల్లితెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించేవారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న వాటితో కలిపి కళాశాల బాబు 50కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చాలా సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్‌లో నటించడంలో ఆయన చాలా పాపులర్. కళాశాల బాబు మృతితో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here