నీరవ్ మోదీ పై ఛార్జ్ షీట్ దాఖలు…

490

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.12,400 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసినదే . ఇప్పుడు నీరవ్ మోదీ పై సీబీఐ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో నీరవ్ తో సహా మొత్తం 25 మంది నిందితుల పేర్లను చేర్చింది. ఈ ఛార్జ్ షీట్లో అలహాబాద్ బ్యాంకు ఎండీ అనంత సుబ్రమణియన్, పీఎన్బీ ఎగ్జిక్యూటివ్‌లు బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్, పీఎన్‌బీ జనరల్ మేనేజర్ నెహల్ అహద్, నీరవ్ మోదీకి చెందిన స్టెల్లార్ డైమండ్స్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, డైమండ్ ఆర్ యుఎస్‌ పేర్లు ఉన్నాయి. ఈ ఛార్జ్ షీట్ను సిబీఐ ముంబై ప్రత్యేక కోర్టుకు సమర్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here